అమ్మ ఓపికో, లేక నాన్న మొండితనమో తెలీదుకాని, ఎందుకో చిన్నప్పటి నుంచి దేన్నయినా చిరునవ్వుతో చూడటం అలవాటు అయిపోయింది... కొన్ని కొన్ని సార్లు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది... అసలు ఇంత ఓపిక నాకు ఎక్కడినుంచి వచ్చిందా అని.. పెళ్ళికి ముందు చాలా విషయాల్లో ఓపిక వహించినా కొన్ని సార్లు తప్పనిసరిగా చిర్రు బుర్రులు ఆడవలసిందే .. లేకపోతే నేను చిట్టిని ఎలా అవుతాను అని అమ్మమ్మ ముచ్చటపడిపోయేది... పెళ్లి ఒక మగవాడిని ఎంత మారుస్తుందో తెలీదు కానీ... ఒక ఆడపిల్లని మాత్రం చాలా పరిణితి చెందేలా చేస్తుంది .. నా స్వానుభవంతో చెప్తున్నాను .. నేను ఒక్కదాన్నే కాదు... నాతో పాటు చదువుకుని నాతో ఇన్ని సంవత్సరాలు స్నేహం చేసిన నా ఫ్రెండ్స్ అందరు కూడా ..
ఏంటో తెలీదు... మాటలో సూటిదనం, నవ్వులో స్వచ్చతా లేకుండా పొయాయి... ఎందుకు???? ఏం చేయాలన్నా.. మా ఆయనని ఒక మాట అడిగి చెప్తా అనేదే యూనివర్సల్ అన్సర్ అయిపొయింది మా అందరికి!! ఇంతకుముందు తప్పు లేకుండా ఒక్క మాట కూడా పడేవాళ్ళం కాదు... ఇప్పుదు.. లేని తప్పుని మీద వేస్కుని మరీ కాపాడుకుంటున్నాము మన పతిదేవుళ్ళని !! అసలు నాకే విడ్డూరంగా ఉంది ఇదంతా!! ఎం చేస్తాం! కాపురం అన్నాక తప్పదు కదా అనే మాట మన అమ్మమ్మల కాలం నుంచి వింటూనే వస్తున్నాం! ఏమిటో .. అసలు ఎం రాస్తున్నానో కూడా అర్థం కావడంలేదు!! కర్మ!
తప్పు ఎవరిదయినా సరే .. సర్డుకుపోవాల్సింది నేను ... ఎన్ని తిట్టినా సరే.. కుక్కిన పేను అవ్వల్సింది నేనే! ఇద్దరిలో పెద్ద చిన్న అంటూ ఎవరు లేరు అని పైకి గొప్పలు చెప్పినా , నిజం నిష్టూరంగానే ఉంటుంది అని తెలీదా ? మన వ్యవస్థ అంతే ... మన భవిష్యతు అంతే! ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరె... మన సనాతన భారతీయ పతివ్రతా ధర్మమ్... థాంక్స్ టు యు !!! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!!!