వానా వానా!!!

ఈ రోజు నేను చాలా చాలా ఆనందంగా ఉన్నానోచ్!!! కాసేపు చిన్న పిల్లలతో కలిసిపోయి...వాళ్ళల్లో ఒక దాన్ని అయిపోయి...చాలా చాలా సంతోషంగా వాన లో తడిచాను...వాళ్ళతో ఆడుకుంటూ...అరుస్తూ...పరిగెడుతూ...ఆఖరికి వాళ్ళ అమ్మల్లాగా మా అమ్మ కూడా నన్ను నాలుగు తన్ని ఇంటికి తీస్కెళ్ళే దాకా!!! ఇక ఇంటికి వెళ్ళాక మా అమ్మ తిట్లు పకోడీలు మామూలే కదా!!! కాని మళ్లీ జలుబు పట్టుకుంది...ఇక నా డబ్బింగ్ అటక ఎక్కేసినట్టే ఒక వారం!! హా హా...!!!

ఎందుకో చాలా రోజుల తరువాత అమ్మ నాకు అన్నం తన చేతులతోనే కలిపి తినిపించింది...ఎప్పుడు ఉండే పప్పు అన్నమే!! కాని ఎందుకో ఈ రోజు చాలా రుచిగా అనిపించింది...అమ్మ తినిపిస్తుంది కదా అందుకే!!! మొత్తానికి ఈ రోజంతా అలా గడిచింది అన్నమాట!! ఇదంతా మావ్వులాటగా ఉంది మా తమ్ముడికి అమ్మకి...వాళ్లకి ఏం తెలుసు??? లైఫ్ లో అన్ని చిరాకులు ఉన్నప్పుడు ఏ కాస్త ఆనందం దొరికినా ఇలా బ్లాగ్ రాయాలి అనిపించేంత ముచ్చటగా ఉంటుంది!!!

ఇక ఇప్పుడు హాయిగా అమ్మ నిద్రపుచుతుంటే నిద్రపోతాను!!! మళ్లీ పసి పాపగా మారిపోతాను...అమ్మ ఒడిలో...!! Gud Nite Folks!!!