ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని...

కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు...అసలు ఈ మీడియా ఫీల్డ్ కి ఎందుకు వచ్చానా అని...ముఖ్యంగా ఇలా పసి బిడ్డల్ని, మరీ ముఖ్యంగా ఆడపిల్లలని దారుణంగా రోడ్లపై పారేయడం...ఛా...ఇవి నా నోటితో నేను చదవాలా?? అనిపిస్తుంది....నిన్న మరీ దారుణమయిన న్యూస్ చదివాను...పాపం మూడు రోజుల పురిటి కందు...ఆడపిల్ల...అదే ఆ పిల్ల చేస్కున్న పాపం...దారుణంగా వరంగల్ రైల్వే స్టేషన్లో ఒక జనరల్ భోగిలో విసిరేశారు...పాపం ఆ ఇనుప రేకుల మీద పడిన ఆ పసిదాని కుడి చెయ్యి ఎముక విరిగిపోయింది...గుక్క పట్టి ఏడ్చి ఏడ్చి సోమ్మసిల్లిపోయింది...తోటి ప్రయాణీకులు చూసి వెంటనే M.G.M ఆసుపత్రికి తీసుకువెళ్ళారు ...కాని అప్పటికే ఆలస్యం అయిపొయింది...ఆ కుడి చెయ్యి తీసేస్తే తప్ప పాప బ్రతకదు అన్నారు డాక్టర్లు...చెయ్యి తీసేశారు...చదువుతూ ఉండగానే నాకు గొంతు పూడుకుపోయింది...ఎంత న్యూస్ రీడర్ అయినా...నేను మనిషినే కదా! ఆడపిల్లని కదా...ఇది చాలదు అన్నట్టు బ్యాక్ గ్రౌండ్లో మధు ప్రియ పాట వినిపిస్తోంది..."ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని..." కళ్ళల్లో తిరుగుతున్న నీటిని బలవంతంగా ఆపుతూ...పూడుకుపోయిన గొంతుని సవరించుకుంటూ...నా కర్మ...నవ్వుతు...ఇప్పుడొక షార్ట్ బ్రేక్ అని చెప్పా...అసలు పేస్ లో ఏ ఎమోషన్స్ కనిపించకూడదుగా...ఒక న్యూస్ రీడర్ కి...మా దౌర్భాగ్యం...

న్యూస్ అయిపోయి కిందికి వచ్చాక లంచ్ చేద్దాం అనుకున్న...కాని ఆకలి చచ్చిపోయింది...హ...అయిన..ఇలాంటి సంఘటనలు చాల సార్లు వచ్చాయి నాకు లైవ్ న్యూస్ లో ఉన్నప్పుడు...అలవాటు పడతానులే మెల్లమెల్లగా అనుకున్నను కానీ...నా వల్ల కావడంలేదు...ఎంతయినా ఆడపిల్లని కదా...

కట్న కానుకలు తేవడానికి...పెళ్లి చేస్కోవడానికి...ఇంటి చాకిరి చేసి అందరికి వండి వార్చడానికి...కాపురం చేసి పిల్లల్ని కనిపెట్టడానికి...సంపాదించి భర్తకి చేదోడు వాదోడుగా ఉండటానికి ఆడపిల్ల కావలి...కాని...కూతురిగా మాత్రం ఇష్టంలేదు...అసలు కూతురే పుట్టకూడదు...ఇది మన సమాజం...భారతదేశంలో స్త్రీని దేవతలా పూజిస్తారా...గాడిద గుడ్డేం కాదు??? పూజించాక్కర్లేదు...బ్రతకనిస్తే చాలు....అయినా...ఇది ఇప్పటిది కాదుగా...its a never ending tragedy... 

No comments:

Post a Comment